అందుకే ప్రభాస్ ని 'రెబల్' అంటారు
అధర్మాన్ని, అన్యాయాన్నీ సహించని ఓ యువకుడి కథ ఇది. మంచో, చెడో మొహం మీదే చెప్పేస్తాడు. అందుకే ఆతన్ని అందరూ రెబల్ అని పిలుస్తారు. ‘రెబల్’ అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా ‘ఛత్రపతి’. ఆ సినిమాను మించే స్థాయిలో మా ‘రెబల్’ ఉంటుంది అన్నారు. ఆ పాత్రలో ప్రభాస్ చక్కగా ఒదిగిపోయారు. ఆయనపై షూట్ చేసిన పైటింగ్ సీక్వెన్స్ లు అంటున్నారు రాఘవ లారెన్స్. ఆయన తన తాజా చిత్రం రెబెల్ గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే ..చేతిలో తుపాకీ ఉంచుకొని శాంతి మంత్రం జపించడం ఎందుకు? రంగంలో దిగాక విజయమో, వీర స్వర్గమో తేల్చుకోవల్సిందే. గెలవడానికి ఆయుధాలు అక్కర్లెద్దు. ఆత్మబలం చాలు... అచ్చం ఓ యువకుడు కూడా ఇలాగే అనుకొన్నాడు. మరి ఆ పోరాటంలో గెలిచాడా? లేదా? ఈ విషయం తెలియాలంటే 'రెబల్' సినిమా చూడాల్సిందే అని చెప్పారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కూడా ఆయనే సమకూర్చారు. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్, మాటలు: స్వామి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్.

No comments:
Post a Comment