Tuesday, February 14, 2012

why-sneha-walked-of-rajinikanth's-kochadaiyaan


పెళ్లి కారణంగానే...రజనీ సినిమా వద్దనుకుంది!

సీనియర్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘కొచ్చాడయాన్’ సినిమాలో నటి స్నేహ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె రజనీ చెల్లెలి పాత్రలో నటించాల్సి ఉంది. రజనీ లాంటి పెద్ద స్టార్‌తో అవకాశం రాగానే ఎగిరి గంతేసిన స్నేహ ఇప్పడు ఆ సినిమా నుంచి తప్పుకుంది. కారణం ఏమిటంటే...డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని చెప్పింది. అయితే స్నేహ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి వేరే కారణం ఉందని అంటున్నాయి చెన్నయ్ సినీ వర్గాలు. తన పెళ్లి ఏర్పాట్లలో భాగంగానే సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది.

ఆమె స్థానంలో తమిళ నటి రుక్మిణిని ఎంపిక చేశారు. ఈ చిత్రంలో రజనీ సరసన దీపిక పడుకొనె ఖరారైంది. ఆమెతో పాటు తెలుగు నటుడు ఆది, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఇతర పాత్రలకు ఎంపికయ్యారు. ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

కథానాయిక స్నేహ తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఈ విషయాన్ని ప్రసన్న గతంలోనే వెల్లడించారు. స్నేహ, ప్రసన్న కలిసి 'అచ్చముండు అచ్చముండు' అనే తమిళ చిత్రంలో నటించారు. ''నేనూ, స్నేహ ప్రేమించుకున్న విషయం నిజమే. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఇందుకు ఒప్పుకొన్నారు అని వెల్లడించిన విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి తేదీలను ప్రకటించనున్నారు.

No comments:

Post a Comment