'అలా మొదలైంది' హిందీ రీమేక్ డిటేల్స్
క్రితం సంవత్సరం ప్రారంభంలో వచ్చి హిట్టైన చిత్రం అలా మొదలైంది.నాని,నిత్యా మీనన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు హిందీలోకి రీమేక్ అవుతోంది. ఈ చిత్రం రైట్స్ ని వసు భగ్నాని తీసుకున్నారు. ఆయన కుమారుడు జాకినీ హిరో గా పెట్టి సినిమా ప్లాన్ చేస్తున్నారు. జాకీ అంతకుముందు ఫాల్తూ చిత్రంతో పరిచయమయ్యారు. ఆ చిత్రం ఓ మాదిరిగా ఆడింది. దాంతో ఇప్పటికే ప్రూవ్ అయ్యిన అలా మొదలైందితో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. డైరక్టర్ సెట్ కాగానే సెట్స్ మీదకు వెళ్లనుంది.
సౌత్ రీమేక్ లు అన్నీ వరసగా రీమేక్ లు అవుతున్న నేపద్యంలో ఈ చిత్రం కూడా రైట్స్ మొత్తానికి అమ్ముడవటం చిన్న చిత్రాల నిర్మాతలకు కాస్త ఊపిరి పోసినట్లైంది. ఇక అలా మొదలైంది దర్శకురాలు నందినీరెడ్డి రెండు రోజుల క్రితం సిద్దార్ద,సమంత కాంబినేషన్ లో సినిమాని ప్రారంభించారు. బెల్లంకొండ సురేష్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం కూడా ఓ రొమాంటిక్ కామిడీ అని తెలుస్తోంది. బాలీవుడ్ లో వచ్చి హిట్టైన ఓ రొమాంటిక్ కామిడీ ఆధారంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ సమాచారం.

No comments:
Post a Comment