Wednesday, February 8, 2012

Lakshmi-manchu-about-rgv-department

వర్మ నాకు అబ్సెస్ అవుతారనుకుంటున్నా: మంచు లక్ష్మి

వర్మ నాకు అబ్సెస్ అవుతారనుకుంటున్నా...అప్పుడు ఆయన నన్ను బాగా స్క్ర్రీన్ పై బాగా ప్రొజక్ట్ చేస్తారు అంటోంది మంచు లక్ష్మి ప్రసన్న. అవిడ తన తన తాజా చిత్రం డిపార్టమెంట్ గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా లైటర్ వీన్ లో స్పందించింది. అలాగే తాను సంజయ్ దత్ భార్యగా డిపార్టమెంట్ లో నటిస్తూ అక్కడ పరిచయమవుతున్నానని చెప్పింది. ఇక వర్మ తో ఇది రెండో చిత్రమని,దొంగల ముఠా తర్వాత చేస్తున్న సినిమా అని చెప్పింది. వర్మ చాలా ఇంటెన్స్ డైరక్టర్ అని,ఆయనకు ఆర్టిస్టుల నుంచి ఎగ్జాక్ట్ గా ఏమి కావాలో తెలుసు అని,అది ఖచ్చితంగా తీసుకుంటారని అని చెప్పుకొచ్చింది. ఇక ఆమె తమిళంలో కూడా ఓ చిత్రం నిర్మిస్తూ నటిస్తోంది. ఆ సినిమా పేరు మరందేన్ మన్నిత్తేన్.

ఆ సినిమా గురించి చెప్తూ... 1986లో గోదావరి తుపాన్ ముప్పులో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక ప్రేమ జంట కూడా చిక్కుకున్న వృత్తాంతంతో తెరకెక్కిస్తున్న చిత్రమే మరందేన్ మన్నిత్తేన్ అని చెప్పారు. ఈ చిత్రం కోసం గోదావరి తీరంలో పది రోజులు తాను, హీరో ఆది నటించామని తెలిపారు. మరో 25 రోజులు అక్కడే చిత్రీకరణ జరపాల్సి ఉందనీ, ఇది భారీ బడ్జెట్ చిత్రమని వివరించారు. దీన్ని తమిళం, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఇందులో తాను తూత్తుకుడిలో పుట్టి కాంచీపురంలో చీరలమ్మే యువతిగా నటిస్తున్నానని చెప్పారు. మణిరత్నం చిత్రంలో నటించాలనే చిరకాల వాంఛ కడల్ చిత్రంలో తీరనుండటం సంతోషంగా ఉందన్నారు.

ఈ చిత్రం తమిళంలో తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందన్నారు. పరుత్తివీరన్, సుబ్రమణిపురం చిత్రాలు చూసినపుడు ఆ చిత్రాల్లో తాను నటించలేకపోయానే అనే ఫీలింగ్ కలిగిందన్నారు. అవకాశం వస్తే ఆ తరహా కథాచిత్రాల్లో నటించాలనే కోరిక ఉందన్నారు. నటన, చిత్ర నిర్మాణం తనకు రెండు కళ్లు లాంటివని, అందువలన ఈ రెండు రంగాల్లోనూ కొనసాగుతానని లక్ష్మీ ప్రసన్న అంటున్నారు

No comments:

Post a Comment