Monday, February 6, 2012

allu-arjun-signs-rs-2-crore-deal

కోల్గెట్ యాడ్ కి అల్లు అర్జున్ రెమ్యునేషన్

అల్లు అర్జున్ త్వరలో టీవీల్లో,పేపర్లో కోల్గెట్ టాత్ పేస్ట్ తో పళ్లు తోముకుంటూ కనిపించనున్నారనే సంగతి తెలిసిందే. ఆయన తాజాగా ఈ ఉత్పత్తికి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసారు. ఈ యాడ్ నిమిత్తం అల్లు అర్జున్ రెండు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. అలాగే ఈ యాడ్ ..కేరళలోనూ,కర్ణాటకలోనూ రానుంది. అందుకే అంత రెమ్యునేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇక యాడ్ లో కనిపించే విషయాన్ని అల్లు శిరీష్ కన్ఫర్మ్ చేస్తూ ...కోల్గెట్ వారు అల్లు అర్జున్ ని తమ ఎపి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకున్నారు. సెవెన్ అప్,కోల్గెట్ వంటి రెస్పెక్టెడ్ నేషనల్ బ్రాండ్ లకు అంబాసిడర్ కావటం హ్యాపీగా ఉందంటూ ట్వీట్ చేసారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ..త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం చేస్తున్నారు. ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య తన హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టైరేజేషన్ హైలెట్ గా ఉంటుందని చెప్తున్నారు.

అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని భావిస్తున్నారు. బాలీవుడ్ కెమెరామెన్ అమోల్ రాఘోడ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ భాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇలియానా నటించనుంది. మిగతా ముఖ్యపాత్రల్లో రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తణికెళ్ల భరిణి, ఎమ్ ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, సోనూ సూద్, బ్రహ్మాజి, రావు రమేష్, ప్రగతి, తులసి, హేమ తదితరులు నటించనున్నారు. అలాగే సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించనున్నారు. రవీందర్ ఆర్ట్ దర్శకత్వం,పీటర్ హెయిన్స్ ఫైట్స్ అందిస్తారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్

No comments:

Post a Comment