Sunday, February 12, 2012

eega-gets-bumper-offer-karnataka


కర్నాటకలో రాజమౌళి‘ఈగ’ దుమారం!

హిట్ చిత్రాల దర్శకుడు రాజమౌళి తాజాగా ‘ఈగ’ అనే సాంకేతిక అద్భుతమైన సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారత దేశ సీని చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన గ్రాఫిక్స్ తో రూపొందిస్తున్నారని, చిత్రీకరణ కోసం హాలీవుడ్ రేంజ్ టెలిస్కోపిక్ కెమెరాలు వాడుతున్నారని చర్చించుకుంటున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం మార్చి 9న ఈ చిత్ర ఆడియో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆస్తి‌కర విషయం ఏమిటంటే...కర్నాటకలో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న కన్నడ స్టార్ సుదీప్ కు అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ రిలీజ్ చేసి అత్యధిక కలెక్షన్లు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి డిస్ట్రి బ్యూటర్లు కూడా సినిమాపై చాలా ఆసక్తి చూపుతున్నారు. కర్నాటక రైట్స్ ను దాదాపు రూ. 3 కోట్ల వరకు చెల్లించి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే నిర్మాతలు అంతకంటే ఎక్కువ ఆశిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

భారత దేశ సినీ పరిశ్రమ గర్వించే రేంజ్ లో సినిమా రూపొందుతోంది అంటే...ఈ సినిమా దుమారం అటు కర్నాటకలో, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరో రెండు నెలల్లో సినిమా విడుదల కానుంది. అప్పుడుగానీ తెలియదు ఈగ సత్తా ఏమిటో. సమంత, నాని, సుదీప్ ఈచిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రఫీ కె.కె.సెంథిని, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత : సాయి కొర్రపాటి, దర్శకత్వం : ఎస్.ఎస్. రాజమౌళి

No comments:

Post a Comment