Sunday, February 12, 2012

prabhu-deva-made-sarpa-dosha-nivaran-pooja


నయన దూరం - శ్రీకాళ‌హస్తిలో ప్రభుదేవా పూజలు

సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా శనివారం శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో సర్పదోష నివారణ పూజలు నిర్వహించారు. ఒంటరిగానే వచ్చిన ఆయన పూజా కార్యక్రమం ముగిసిన అనంతరం అక్కడి నుంచి వెళ్లి పోయారు.
తన ప్రియురాలు నయనతార దూరం అయిన నేపథ్యంలో....ప్రభుదేవా ఈ పూజలు నిర్వహించినట్లు చర్చించుకుంటున్నారు.

పెళ్లి వరకు వచ్చిన నయనతార-ప్రభుదేవా వ్యవహారం గత కొన్ని రోజుల క్రితం తారుమారైంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నయనతారను ప్రభుదేవా మోసం చేశాడని, డబ్బు కోసం ప్రేమ నాటకం ఆడి ఆమెను నిండా ముంచాడని నయనతార కుటుంబ సభ్యులు ఆరోపించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

ఓ వైపు చూస్తే నయనతార కోసం ప్రభుదేవా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి వదిలించుకున్నాడు. మరో వైపు ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడం కోసం నయనతార చాలా త్యాగాలు చేసింది. మతం మార్చుకుంది. సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కళ్ల దగ్గరకు వచ్చిన పెద్ద అవకాశాలను కాదనుకుంది. ఈ తరుణంలో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు ఎందుకు వచ్చాయి? అనేది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు.

No comments:

Post a Comment